Lingala Kedari Death
* హోటల్ యజమాని లింగాల కేదారి మృతి
* షార్ట్స్ సర్క్యూట్ కావడంతో తీవ్ర గాయాలు
* చికిత్స పొందుతూ మృతి
ఆకేరు న్యూస్, హనుమకొండ : రూ.50 లకే భోజనం..ఒక్క మెతుకు వదిలేస్తే జరిమానా హోటల్ ఫేం ..అదాలత్ సర్కిల్ లో హోటల్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో యజమాని లింగాల కేదారి మృతి చెందారు..
బుధవారం రాత్రి హోటల్లో మరుసటి రోజు వంటలకు అవసరమైన పిండి పదార్థాలు సిద్దం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గా తెలుస్తోంది..
* మెతుకు వదిలేసినా జరిమానా:
ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదన్న విదానం లింగాల కేదారి అవలంభించే వాడు..హోటల్లో, విందు భోజనాల్లో తినడానికి కంటే ఎక్కువ ఆహారం వృధా చేస్తారని ఆయన చెప్పే వారు..అందులో భాగంగా తన హోటల్లో కేవలం రూ.50 లకే ఫుల్ భోజనం అందించేవాడు ..
ఎవరైనా వదిలేస్తే జరిమానా విధించేవాడు ..దీంతో వరంగల్ నగరంలో ఆయన చాలా ఫేమ్ అయ్యాడు ..ప్రమాదం లో యాదగిరి మృతి చెందడంతో వరంగల్ నగర ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు..
సుబేదారి పోలీసులు సంఘటన పై విచారణ చేపట్టారు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.
