HANAMKONDA JOB MELA
* Reliance Jioలో ఉద్యోగాలు
ఆకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా మరియు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెల 24-07-2026 న హనుమకొండలో ప్రైవేట్ ఉద్యోగాల నియామకానికి (Private Placement Drive) ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఉద్యోగ వివరాలు & అర్హతలు..
రిలయన్స్ జియో (Reliance Jio) పోస్టుల వివరాలు: జియో పాయింట్ సేల్స్ ఇంటర్న్, జియో హోమ్ సర్వీస్ ఇంటర్న్, జియో డిజిటల్ రిపేర్ ఇంటర్న్
మొత్తం ఖాళీలు: 20 పోస్టులు
విద్యార్హత: SSC / 12th (ఇంటర్) / Graduate & Post Graduate
వయోపరిమితి: 19 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
పనిచేయాల్సిన ప్రాంతం: తెలంగాణ వ్యాప్తంగా (Across Telangana)
నెలకు వేతనం: ₹11,000/-
* ఇంటర్వ్యూ సమయం..
తేదీ: జులై 24, 2026
సమయం: ఉదయం 10:30 గంటలకు
ప్రదేశం: డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ (MCC), గవర్నమెంట్ ఐటీఐ (బాలుర) క్యాంపస్, ములుగు రోడ్, వరంగల్.
* తీసుకెళ్లాల్సిన పత్రాలు..
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా (Resume/CV), విద్యార్హత ధృవీకరణ పత్రాల (Certificates) జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరడమైనది.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్- 7569038229
