* మహ్మద్ ఆసియాకు ఎమ్మెల్యే నాయిని అభినందనలు
ఆకేరు న్యూస్ హనుమకొండ : యువ ప్రతిభావంతులు మహ్మద్ ఆసియా, మహ్మద్ ఇర్ఫాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో బంగారు పతకం సాధించడం పట్ల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇది హనుమకొండ పట్టణానికే గర్వకారణమని అన్నారు.హనుమకొండ మైనార్టీ గురుకులంలో ఇంటర్ చదువుతున్న మహ్మద్ ఆసియా,కొత్తవాడ గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ చదువుతున్న మహ్మద్ ఇర్ఫాన్ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి తమిళనాడులో జరిగిన కరాటే పోటీల్లో ప్రపంచస్థాయి గౌరవం సంపాదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇద్దరినీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్మానించి అభినందించారు.జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవడం గర్వకారణమని అభినందిస్తూ వీరిద్దరి భవిష్యత్తు మరింత ప్రతిభావంతంగా ఉండాలని కోరారు.తమిళనాడు చెన్నైలోని తాంబరం S.I.B.E.T కాలేజీలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాస్టర్ బాలమురుగన్ ఆధ్వర్యంలో, లండన్ నుండి వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి మిస్టర్ రిషి నాద్ సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక పోటీ జరిగింది.

………………………………………………..
