ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరిపాలన భవనము ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుగా సర్ధార్ వల్లబాయి పటేల్ చిత్రపటానికి పూలమాల వేశారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో దేశంలో ఐక్యమత్యాన్ని, దేశ సమగ్రత కాపాడుతామని అదనపు డీసీపీ రవి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలన్నీ ఒక తాటిపై తీసుకువచ్చి ఒక భారతదేశంగా మార్చడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకంగా నిలిచారు. వారి ఆశయాలకు తగ్గట్లుగా దేశ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉంటూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, తోటి వారితో స్నేహపూర్వకంగా, సోదరభావంతో మెలిగితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తవని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం డీసీపీ రవీందర్,అదనపు డీసీపీ లు రవి, సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలు,, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
………………………………