ఆకేరు న్యూస్,కమలాపూర్ : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని కమలాపూర్ మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పీఎం శ్రీ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని 600 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు ఉదయం నుంచే మూడు గంటల పాటు యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడురి రవీందర్ మాట్లాడారు. యోగ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మన భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ విద్యార్థులకు వివరించారు.నిత్యం యోగసనాలు చేయడం ద్వారా వ్యాధులు దరిచేరవని, మానసికోల్లాసం కలిగి మధుమేహం, బిపి, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయని, శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఏటీపీ మంగా, డిప్యూటీ వార్డెన్ సరిత భాయ్, ఏఎన్ఓ విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు జగదీష్, నాగరాజు, పాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయునిలు విద్యార్థులు, సిబ్బంది, ఎన్సిసి కేడేట్లు పాల్గొన్నారు.

…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
