
* డబ్బులకు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయారు
* పదేళ్ల కాలంలో లెక్కలేనన్ని ఆస్తులు కూడ బెట్టారు
* నాన్నపై మరకలు పడితే కడుపు మండిపోతోంది
* ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆమె డైరెక్టుగా హరీష్ రావు,సంతోష్ రావులపైనే బాణం ఎక్కుపెట్టారు.అమెరికా నుంచి సోమవారం తిరిగి వచ్చిన కవిత మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో కేసీఆర్ ను బదనాం చేయడానికి కుట్ర జరిగిందన్నారు. కుట్ర చేసింది బీ ఆర్ ఎస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న హరీష్ రావు,సంతోష్ రావులేనని కుండపగులగొట్టినట్లు చెప్పారు. హరీష్ రావు,సంతోష్ రావుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత అన్నారు. హరీష్ రావు,సంతోష్ రావులు కేసీఆర్ పేరు చెప్పుకొని గత పదేళ్లలో లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారని కవిత ఆరోపించారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని కేసీఆర్ ను బదనాం చేస్తున్నారని కవిత అన్నారు. కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. రెండో సారి హరీష్ రావును మంత్రిగా అందుకే తప్పించారని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ మీద మరకలు పడడానికి సీబీఐ ఎంక్వైరీ దాకా వెళ్లడానికి హరీష్ రావే కారణమని కవిత విరుచుకుపడ్డారు. కవిత మీడియా ముందు ఇలా మాట్లాడడం రెండో సారి అంతకు మందు కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత తాను తన తండ్రికి రాసిన లేఖను బీఆర్ ఎస్ లోని కీలక నేతలే మీడియాకు విడుదల చేవరని ఆరోపించారు. ఇప్పడు రెండో సారి అమెరికా నుంచి రాగానే హరీష్ రావు,సంతోష్ రావులను డైరెక్టుగా టార్గెట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబిఐకి అప్పగిస్తున్నామని అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే రాష్ట్రవ్యాప్త బంద్ కు ఎందుకు పిలుపునివ్వలేదని ఆమె ప్రశ్నించారు. మా నాన్న పై ఆరోపణలు చేస్తే కడుపుమండుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
……………………………………….