* రేవంత్ రెడ్డి స్ట్రీట్ ఫైటర్ లా వ్యవహరిస్తున్నారు
* సీఎం వ్యాఖ్యలపై హరీష్ ఫైర్
* కడుపులో విషం వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలవాకౌట్
* స్పీకర్ తీరుపై ఆందోళప
* ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తన నోటిని ప్రక్షాలన చేసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండి పడ్డారు, మూసీ ప్రక్షాలనపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు పై విధంగా స్పందించారు. మూసీ నది ప్రక్షాలనపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ ఎస్ నేతలకు కడుపులో విషం ఉందని వ్యాఖ్యానించారు. దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా గన్ పార్క్ వద్దకు చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అధికార పక్షం సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మూసీ నదిపై జరిగిన చర్చలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ప్రతిపక్ష నేతలకు మైక్ ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం ను విమర్శించకుండా ఎలా ఉంటాం అని హరీష్ ప్రశ్నించారు. శాసన సభను గాంధీ భవన్ గా మార్చారని హరీష్ రావు మండి పడ్డారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
…………………………………………….

