* ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)తో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(HARISHRAO), ప్రస్తుత బీజేపీ నేత, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. అలాగే జూన్ 6న హరీష్ రావు, 9న ఈటల విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించింది. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఈ నోటీసుల అనంతరం కేసీఆర్, హరీశ్ రావు ఇప్పటికే ఓ దఫా సమావేశం అయ్యారు. తాజాగా ఈరోజు మరోమారు వారు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
…………………………………………..

