
* పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరి కాసేపట్లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కానున్నారు. బీఆర్ ఎస్ మాజీ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీష్ రావు పై చేసిన ఆరోపణలు అటు పార్టీలోనూ ఇటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. గత రెండు రోజులుగా మీడియాలో అదే చర్చ నడుస్తోంది. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడమే కాకుండా గత పదేళ్లలో హరీష్ రావు లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించాడని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ ఎస్ పార్టీని విచ్చినం చేయడానకి హరీష్ రావు, సంతోష్ రావులు కుట్ర చేశారని కవిత ఆరోపించారు. హరీష్ రావు,సంతోష్ రావులు కాంగ్రెస్, బీజేపీలతో టచ్ లో ఉన్నారని కూడా కవిత ఆరోపణలు చేశారు. శనివారం లండన్ నుంచి తిరిగివచ్చిన హరీష్ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కవిత ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేశానని అన్నారు. దిగజారుగు రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు. కవిత ఆరోపణల నేపధ్యంలో కేసీఆర్ ను హరీష్ రావు మొదటి సారిగా కలువబోతున్నారు. కాసేపట్లో ఎర్రబెల్లి ఫాం హౌస్ కు హరీష్ చేరుకుంటారని సమాచారం ఈ నేపధ్యంలో వీరిద్దరి కలయిక పార్టీలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.
…………………………………………….