* బీఆర్ ఎస్ సర్పంచ్ లను కూడా తన ఖాతాలో వేసుకుంటుండు
* రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే : హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆయన ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన వారికి బాధ్యత పెరిగిందని, ఓడిన వారికి భవిష్యత్ ఉందని తెలిపారు. తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సర్పంచ్ లు కృషి చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు బీఆర్ ఎస్ సత్తా ఏంటో చాటాయన్నారు. కారు జోరుకు కాంగ్రెస్ బేజారు అయిందన్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో 90 శాతం రూలింగ్ పార్టీ గెలిస్తే, 10 శాతం ప్రతిపక్షం గెలుస్తుందని, కానీ ఈ ఎన్నికల్లో మనం 40 శాతం గెలిచామని, 4 వేల మంది బీఆర్ ఎస్ మద్దతుదారులు సర్పంచ్ లుగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మందికి పుట్టిన బిడ్డను కూడా తన బిడ్డగా ముద్దు పెట్టుకుంటాడని, మనం గెలిచిన స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి డబ్బులను ఫుట్ బాల్ కు ఖర్చు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని మరచి అందాల పోటీలు, ఫుట్ బాల్ అంటూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని అన్నారు.
…………………………………………….

