
* పంచాయతీ నిధులు విడుదల చేయాలని డిమాండ్
* గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపణ
* పంచాయతీల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః పంచాయతీల్లో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ మాజీ మంత్రి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఓ లేఖ రాశారు.పంచాయతీ రాజ్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని లేఖలో పేర్కొన్నారు.బీఆర్ ఎస్ హయాంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయని ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని వీధి దీపాల నిర్వహణ లేక గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.బీఆర్ ఎస్ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక ఆర్టీఏ అధికారులకు ట్యాక్సులు కట్టలేక అధికారులకు తాళాలు అప్పజెప్పుతున్నారని హరీష్ పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి నిర్వహణ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.జ. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు చెందిన బిల్లులను విడుదల చేయాలని మాజీ సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్చేశారు. అభయహస్తం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్దీకరించాలని లేఖలో హరీష్ కోరారు.వానా కాలంలో సీజినల్ వ్యాధులు రాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు పారిశుధ్య కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.గతేడాది నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇంత వరకూ వేతనాలు చెల్లించలేదని వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని హరీష్ రావు ఆ లేఖలో డిమాండ్ చేశారు.
………………………………………………….