
* ఆపరేషన్ సక్సెస్
* 3 కోట్ల స్వాధీనం
ఆకేరున్యూస్ హైదరాబాద్ : గత కొంత కాలంగా పెట్రేగిపోతున్న డ్రగ్స్ ముఠా ఈగల్ కంట్లో పడింది
డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈగల్ టీం తన ఆపరేషన్ ను విజయవంతంగా
ముగించింది. నైజీరియన్ డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్ననెట్ వర్క్‌ను చేధించి 3 కోట్ల హవాలా డబ్బును
స్వాధీనం చేసుకుంది. మాక్స్వెల్ అనే నైజీరియన్ దేశస్తుడిని అరెస్టు చేయడంతో హవాలా రాకెట్
బాగోతం బయట పడింది. నైజీరియన్లు పేరు మార్చుకొని ఇండియాలో ప్రవేశిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది.మాక్స్వెల్ దగ్గరి నుంచి నాలుగు పాస్ పోర్టులను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దుర్గారం ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
…………………………………………………..