
* గుండెపోటుతో మృతి చెందిన యువకుడు
* మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ వాసి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని నాగోల్లో (Nagole) విషాదం చోటుచేసుకున్నది. నాగోల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు షటిల్ ఆడుతున్న ఓ యువకుడికి ఒక్కసారిగా గుండెపోటు (Heart Attack) రావడంతో కుప్పకూలాడు. తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేశ్ (Rakesh) (25) నాగోల్లో ఉంటూ, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో రాకేష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
…………………………………….