
*నిండు గర్భిణిని కిరాతకంగా చంపిన భర్త
* బోడుప్పల్ లో దారుణం
ఆకేరు న్యూస్,హైదరాబాద్: కట్టుకున్న భార్యను అతికిరాతంగా చంపిన ఘటన బోడుప్పల్ లోని బాలాజీ హిల్స్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన జ్యోతి, మహేందర్‌లు ప్రేమవివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ మధ్య వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి , భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్వాతిని (22) అతి కిరాతకంగా హత్యచేశాడు. తలను,కాళ్లను,చేతులను నరికి వేశాడు. తల,కాళ్లు చేతులను మూసీ నదిలో పడవేసి మొండెం భాగాన్ని పార్సిల్ చేశాడు. అయితే మహేందర్ గదినుంచి వస్తున్న శబ్ధాలపై ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి విషయం బయట పడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
………………………………………..