
* ఆపై శ్మశానంలో డెడ్‌బాడీని పడేసి..
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : బావ మరిది.. బావ బతుకు కోరతాడంటారు.. కానీ ఇక్కడ ఓ బామ్మర్ది ఇన్సూరెన్స్ మాఫీ అవుతుందని బావను చంపేశాడు. అమీన్పూర్ (Aminpur) లో నివాసముంటున్న బానోతు గోపాల్ నాయక్ (42), ఆయన సొంత బావమరిది నరేష్ నాయక్ కలిసి వ్యాపారం కోసం లోనుపై ఎక్స్ కవేటర్ ను కొనుగోలు చేశారు. బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న జేసీబీ ఇన్సూరెన్స్ మాఫీ అవుతుందని మిత్రులతో కలిసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో పడేశారు. కాగా, వీరి స్వగ్రామం మెదక్ జిల్లా (Medak District) పాపన్నపేట్కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………….