
* భార్యను కొడుకును వదిలేసిన ప్రబుద్దుడు
* తమిళనాడు రాశిపురంలో దారుణం
ఆకేరు న్యూస్ డెస్క్ : అతడు గోవిందరాజు.. ఇల్లు కట్టుకోవడానికి రూ. లక్షల అప్పు.. తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడి.. మానసికంగా యముడిలా మారి.., కొడుకును గదిలో బంధించి.. ముగ్గురు కూతుళ్లను చంపి.. ఆపై తాను ఆత్మహత్య. ఈ సంఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో (Namakkal District) సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలి ఉన్నాయి. తమిళనాడులోని నమక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన గోవింద రాజు (36) ఇల్లు కట్టుకోవడానికి దాదాపు రూ. 20 లక్షలు అప్పు చేశాడు. పెరుగుతున్న అప్పులు.. దాన్ని తిరిగి చెల్లించలేక అతను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. కాగా, సోమవారం రాత్రి భోజనం తర్వాత తన భార్య భారతి (26), ఏడాది వయసున్న కొడుకు అనిశ్వరన్ బెడ్రూమ్లో నిద్రపోయారు. గోవిందరాజు, అతని ముగ్గురు కూతుళ్లు ప్రతీష శ్రీ (9), రితిక శ్రీ (7), దేవిశ్రీ (3) హాలులో పడుకున్నారు. తెల్లవారుజామున భార్య, కుమారుడు బయటకు రాకుండా బెడ్రూమ్ గదికి తాళం వేసి బంధించాడు. అనంతరం కుమార్తెలను పదునైన కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతుళ్లను తండ్రి హత్య చేసే సమయంలో గదికి తాళం వేయడంతో వారి అరుపులు విన్న తల్లి భారతి గట్టిగా కేకలు వేసింది. చుట్టూ పక్కల వారు పరిగెత్తుకొని వచ్చి సరికి అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లలను చూసి షాక్ అయ్యారు. గొవిందరాజు కూడా చనిపోయి ఉన్నాడు. సమాచారం అందిన పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు రూ. 20 లక్షల అప్పుల కారణంగా గోవిందరాజు ఈ దారుణమైన చర్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది
…………………………………………………