
* మధ్యప్రదేశ్ లో దారుణం
ఆకేరు న్యూస్ డెస్క్ : తన సోదరిని వేధిస్తున్నాడని వేధించిన వ్యక్తిని హత్య చేశాడో యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఉంటున్న అభిషేక్ టింగా సోదరి ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.తన సోదరి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయడానికి ఆన్ లైన్ లో ఓ పెద్ద కత్తిని తెప్పించాడు ఆ క్తతితోనే బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ క్రమంలో తన సోదరిని వేధిస్తున్న అనిల్ అనే వ్యక్తిని అదే కత్తితో చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఆగస్టు 22న అనిల్ ఓ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నాడని తెలుసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి అనిల్ వద్దకు వెళ్లాడు తన సోదరి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కత్తితోనే అనిల్ ను పొడిచి చంపాడు. స్థానికులు వెంటనే సమాచారం అందించడందో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
………………………………………………..