
* కేసీఆర్ చేసిన అప్పులకు బాకీలు కడుతున్నాం
* అందిన కాడ అప్పు చేశారు
*మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ ది
* పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడలేదని పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతీ నెలా బాకీ చెల్లిస్తోందని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన గాందీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ ఎస్ చేస్తేన్న బాకీ కార్డుల ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు.పదేళ్లలో ఎక్కడపడితే అక్కడ అప్పుచేసి రాష్ట్రాన్నిఅప్పుల పాలు చేశారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.ప్రభుత్వపరంగా, కార్పొరేషన్ల పరంగా,సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతీ నెలా మహిళలకు 5 వందల సబ్సిడీ ఇవ్వడం బాకీ పడ్డట్టా అని మహేశ్ ప్రశ్నించారు. 2 వందల లోపు యూనిట్లు ఖర్చు చేస్తున్న విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. ఏడాదిలోపు 60 వేల ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీని లాభాల బాటలో వేయడం బాకీ పడ్డట్లా అన్నారు. బీఆర్ ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని 15 నెలల్లో కోటీ 20 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయడం బాకీ పడ్డట్లా అని మహేశ్ ప్రశ్నించారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. పదేళ్ల లో కేసీఆర్ కుటుంబ సభ్యలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం రాలేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రైతులకు రుణ మాఫీ చేయడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. రైతు భరోసా ఇవ్వడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసి 8 లక్షల కోట్ల అప్పు కు ప్రతీ నెలా వడ్డీలు చెల్లించడం ప్రజలకు బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బాకీ పడ్డట్లా అని ప్రశ్నించారు. బీసీ బిల్లును పాస్ చేయకుండా తొక్కి పెట్టింది బీజేపీ కాదా అని మహేశ్ ప్రశ్నించారు. బీసీ బిడ్డను అని చెప్పుకునే ఈటెల రాజేందర్ చిత్తశుద్ధి ఉంటే కేం్రదాన్ని ఒప్పించి బీసీ బిల్ పాస్ చేయించాలని సవాల్ విసిరారు. బీజేపీ బీఆర్ ఎస్ లు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని బద్ నాం చేస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ పై దుష్ప్రయారం చేస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప్ప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
………………………………………………..