
* ప్రొఫెసర్ జయశంకర్ కు కేటీఆర్ నివాళి
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రొఫెసర్ జయశంకర్ (PROFESSOR JAYA SHANKAR)ఉద్యమమే ఊపిరిగా జీవించిన వ్యక్తి అని తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేశారు అని కేటీఆర్ ఎక్స్ వేదికగాట్వీట్ చేశారు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి సందర్భంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. తన జీవితం మొత్తం తెలంగాణ కు ఈఅంకితం చేసిన గొప్పవ్యక్తి అని కేటీఆర్ కొనియాడారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు బాసటగా నిలిచి ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారుఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.
తెలంగాణ తల్లికి విముక్తి కల్పించారు
వలస పాలకుల చేతిలో బందీగా ఉన్న తెలంగాణ తల్లికి ప్రొఫెసర్జయశంకర్ విముక్తి కల్పించారని ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) కొనియాడారు.జయశంకర్ జయంతి సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా జయశంకర్‌కు నివాళులర్పించారుకేసీఆర్కు దశ దిశ చూపించింది జయశకర్ సారే అని కవిత అన్నారు.
………………………………………..