
* టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్ హత్య
ఆకేరు న్యూస్, డెస్క్ : మెక్సికో సోషల్ మీడియా ఇన్ఫ్లుయొన్సర్లు (Mexico Social Media Influencer), టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(Valeria Marquez)(23)ను దారుణంగా హత్య చేశారు. గౌడలజరా నగరంలో ఓ సెలూన్లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్(Live Streaming) చేస్తోంది. ఆ గదిలోకి వచ్చిన అగంతుకుడు వలెరియా నువ్వేనా? అని అడిగాడు. ఆమె అవును అనగానే ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే వలెరియా మృతి చెందింది. ఆమె హత్యకు కారణాలు అంటే దానిపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాజిక్ ఎండ్ అంటూ పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయొన్సర్లు ఆమెకు నివాళి అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………