
* నేను భారత్‌కు కోడలిని.. నన్ను ఇక్కడే ఉండనివ్వండి..
* పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్ రిక్వెస్ట్..
ఆకేరున్యూస్, ఢిల్లీ: భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సీమా హైదర్ కోరారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్‌కు కోడలినని.. ఈ క్రమంలో భారత్‌లో ఉండనివ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కఠినచర్యలు తీసుకుంది. సార్క్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్‌కు వచ్చిన వారంతా వారంలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత సీమా హైదర్‌ను పాక్‌కు పంపాలనే డిమాండ్ మొదలైంది. వైరల్ అవుతున్న వీడియోలో సీమా హైదర్ మాట్లాడుతూ.. ‘నేను పాక్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పుడు వారి ఆశ్రయంలో ఉన్నానని మోదీ జీ, యోగి జీకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పాకిస్తాన్ కూతురిని, కానీ ఇప్పుడు నేను భారత్ కోడలిని. నన్ను ఇక్కడే ఉండనివ్వండి’ అని పేర్కొంది. సచిన్ మీనాను వివాహం చేసుకున్న తర్వాత తాను హిందూ మతాన్ని స్వీకరించానని హైదర్ తెలిపింది.
……………………………………..