– ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?
– ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 30 కేసులు పెట్టారు
-హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజరాబాద్: హుజరాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామ పంచాయతీలల్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో అయినా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు.హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకి రెండు లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని మాటిచ్చారని, తప్పకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న రైతుబంధు ఇవ్వలేదని ,వ్యవసాయం చేసుకునే ప్రతీ రైతుకి రైతుబంధు ఇవ్వాలన్నారు. తనపై ఇప్పటికి 30కేసులు నమోదు చేశారని, అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపేదిలేదన్నారు. వీణవంక, జమ్మికుంట మండలాల కింద ఆరు వేల ఎకరాలకు నీరందించే కల్వల ప్రాజెక్టు 2023 లో తెగిపోయిందని దాని మరమ్మతు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డిపిఅర్ సిద్ధమైందనీ , ప్రాజెక్టు పూర్తి చేయాలని, ప్రాజెక్టు ఆవశ్యకతను అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. నియోజకవర్గంలో దళిత బందు రెండవ విడత నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆనాడు దళిత బంధు 10 లక్షలకు బదులు 12 లక్షల దళిత బంధువు ఇస్తామని అన్నారని తప్పకుండా ఇవ్వాలన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ హుజురాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి దళిత సోదరులను ఇబ్బంది పెట్టిన విషయంపై పిటిషన్ ఇస్తామని అన్నారు.
కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజరాబాద్ మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి హుజురాబాద్ హుజురాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ బండి రమేష్ , హుజురాబాద్ పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..