* ఎన్నికల విధుల్లో ఘటన
ఆకేరు న్యూస్, సూర్యపేట : ఎన్నికల విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు గుండెపోటు వచ్చింది. సూర్యపేట జిల్లాలోని నూతనకల్ మండలంలోని మిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి విధుల్లో ఉన్నాడు. విధి నిర్వహణలో ఉన్న యాదగిరి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అక్కడే ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యపేటలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
……………………………
