Tirumala Darshan Waiting Time
* సర్వదర్శనానికి 8 గంటల సమయం
అకేరు న్యూస్ తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని మొత్తం 84,873 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించారు. మొత్తం 36,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.67 కోట్ల ఆదాయం లభించింది.
భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణ పాటిస్తూ, టీటీడీ సూచనలను అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
