
* ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరో నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శుక్ర, శని, ఆది, సోమవారాల్లో భారీవర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లోని పలు లోలెవల్ వంతెనలు భారీ వర్షానికి నీటిలో మునిగాయి. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు ఈ సీజన్లో లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని అంటున్నారు. రోడ్లమీద వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, రోడ్లపై నడుస్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
……………………………………..