
*ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఈమధ్య కాలంలో సాంకేతికత కారణాల వల్ల ,ఇతర కారణాల వల్ల విమానాలు. హెలికాప్టర్లు కుప్పకూలటం చూస్తున్నాం. తాజాగా ఘనా (Ghana) దేశంలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 6, బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ మిలిటరీ హెలికాప్టర్, ఘనా రాజధాని అక్ర నుంచి ఒబువాసి నగరానికి బయలుదేరింది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధం కోల్పోయింది. అప్పటికే అప్రమత్తమైన అధికారులకి కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ లేకపోవడంతో హెలికాప్టర్ కుప్పకూలిన విషయం అర్ధం అయ్యింది. కొద్దిసేపటిలోనే ఘోరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం 8 మంది చనిపోయారు. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. హెలికాప్టర్ కుప్ప కూలిన సమయంలో దానిలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. . యుద్ధప్రాతిపదిక సహయక చర్యలు మొదలుపెట్టాయి. హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు తెలిపారు.
…………………………………………..