
* సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేపాల్ ప్రభుత్వం దేశంలో సోషల మీడియా బ్యాన్ చేసిన నేపధ్యంలో దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి . దేశ వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. నేఏపాల్ లో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వం నేపాల్ లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. వందన : రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ 91 9871999044,జి. రక్షిత్ నాయక్ లైజన్ ఆఫీసర్ 91 9643723157,సీ హెచ్ చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 91 9949351270 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, తెలంగాణ పౌరులెవరూ గాయపడినట్లు లేదా తప్పిపోయినట్లు సమాచారం లేదు. ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పౌరుల భద్రత, త్వరితగతిన స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టింది.
…………………………………………