
* నేను సీఎంగా ఉన్నంతకాలం అనుమతి ఇవ్వను
* వ్యాపారాలు చేసుకోండి.. ప్రాణాలతో చెలగాటమాడొద్దు
* బాలుడిని పరామర్శించేందుకు వెళ్లలేదు..
* హీరోను అరెస్ట్ చేస్తే ఇండస్ట్రీ మొత్తం తరలివెళ్లింది
* రావొద్దన్నా వచ్చారు.. హీరో రోడ్ షోతోనే తొక్కిసలాట
* సంథ్య థియేటర్ ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : తాను సీఎంగా ఉన్నంత కాలం సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY)వెల్లడించారు. సంథ్య థియేటర్(SANDHYA THEATOR) వద్దకు రావొద్దని పోలీసులు చెప్పినా, సినిమా యూనిట్ వినిపించుకోలేదని తెలిపారు. వచ్చిన హీరో నేరుగా థియేటర్ కు వెళ్లి ఉంటే.. ఓ ప్రాణం పోకపోయేదేమో అన్నారు. హీరో రోడ్ షోతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండని, ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. సంథ్య థియేటర్ ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రశ్నించడంతో సీఎం స్పందించారు. హీరో హీరోయిన్లు వచ్చేందుకు దరఖాస్తు తిరస్కరించినా థియేటర్ వచ్చారని అన్నారు.
హీరో రోడ్ షో (HERO ROAD SHOW)కారణంగా జనం భారీగా వచ్చారని, హీరోను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారని, తొలిక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని వివరించారు. తొక్కిసలాట తర్వాత హీరోను అక్కడి నుంచి పంపిచేశారని, తిరిగి వెళ్లేటప్పడు కూడా కారులో రూప్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని అన్నారు. తొక్కిసలాట ఘటనలో పలువురిని అరెస్ట్ చేశామని, ఏ11 గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులు వారి విధి నిర్వహించారని, హీరోను అరెస్ట్ చేసిన తర్వాత.. కొందరు రాజకీయ నాయకులు నీచాతినీచంగా తనపై స్టేట్ మెంట్ లు ఇచ్చారని విమర్శించారు. బాలుడిని పరామర్శించేందుకు ఎవరూ వెళ్లలేదని, హీరోను అరెస్ట్ చేస్తే ఇండస్ట్రీ (INDUSTRY)మొత్తం కదిలిందని అన్నారు. ఇండస్ట్రీ బాగుండాలనే టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చామని, ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు.
…………………………………………