* మారేడుమిల్లి ఎన్కౌంటర్ అబద్దం
* లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: మారేడుమిల్లి ఎన్కౌంటర్ అబద్దమని మావోయిస్టులు ఆరోపించారు. హిడ్మా ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ‘అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారు. వాళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనడం అవాస్తం. చికిత్స కోసం హిడ్మా విజయవాడకు వెళ్లారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం. వారిలో కోసాల్ అనే వ్యక్తి ముఖ్యుడు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులని లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 27న చికిత్స కోసం హిడ్మా వెళ్లగా.. పోలీసులు సజీవంగా పట్టుకుని..ఆయనతో పాటు 12 మందిని పట్టుకుని హత్య చేశారని పేర్కొన్నారు. హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లని కట్టు కథలు అల్లారన్నారు.మారేడుమిల్లి ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుని.. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని లేఖలో పేర్కొన్నారు.
………………………………..
