ఆకేరు న్యూస్, డెస్క్ : హిడ్మా మృతదేహాం స్వగ్రామానికి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని పూవర్తికి తీసుకొచ్చారు. హిడ్మా మృతదేహాన్ని చూసి గ్రామస్థులు కన్నీటిపర్యాంతమయ్యారు. హిడ్మా తల్లి పుంజి రోధనతో గ్రామంలో తీవ్ర విషాదం నిండింది. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం హిడ్మాను సొంత గ్రామానికి తీసుకురావడంతో గ్రామస్థులు హిడ్మా మృతదేహానికి దండం పెడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
హిడ్మా…!?
“లొంగిపోని పోరాటమా…
తల వంచని చైతన్యమా…
మడమ తిప్పని సాహసమా…
మరుపు రాని యుద్ధ నినాదమా…
అనన్య సామాన్యమైన తెగువకి నిండు నిదర్శనమా…
నేలకొరిగిన విప్లవ హిమాలయమా…
జీవ జాలాన్ని నశింప జేయచ్చుగాని.. భావా జాలాన్ని అంతమందించడం ఎవడి తరం కాదు.
కుటుంబానికి పక్క ఇల్లు లేని దీన స్థితి, కన్న తల్లికి కనీసం ముక్కున పుల్ల చేపించలేని హీన స్థితి. సమ సమాజ నిర్మాణం చేయాలనే ఆశయం, చేసిన సేవ, చూపిన త్యాగానికి రాజ్యం నీ తల్లికి గర్భశోకం ఇవ్వచ్చు గాక. స్వతంత్ర భారతావనిలో 78 ఏళ్ళు గడిచిన అణిచివేత, అవినీతి, దోపిడీ నియంతృత్వం రాజ్యమేలుతున్నంత కాలం… స్వేచ్చా, సమానత్వం, సమ న్యాయం కోసం మీ తరుపున సమార పోరాటం సాగిస్తాం..
లాల్ సలాం కామ్రేడ్ హిడ్మా….
………………………………………..
