
* భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో విమానాశ్రయాలకు ఉగ్రవాదులనుంచి భారీ ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిర్‌స్ట్రిప్ట్, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూళ్లు, శిక్షణ సంస్థల్లో భద్రతను పటిష్టం చేశారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో 24 గంటలూ అప్రమత్తతను పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేయాలని, సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా తనిఖీలు చేయాలని అప్రమత్తం చేశారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, లగేజీ కనిపిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి ప్రయాణికులు తీసుకువెళ్లాలని, సీసీటీవీ సిస్టమ్‌లతో నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు, ప్రోటోకాల్స్‌ను సమీక్షించి, యాక్టివేట్ చేయాలని అడ్వయిజరీలో పేర్కొంది. ఎయిర్పోర్ట్ డైరెక్టర్లు తప్పనిసరిగా స్పెషల్ ఎయిర్‌లైన్ పాసింజర్ సర్వీస్ కమిటీ సమావేశాలు జరపాలని సూచించారు.
……………………………..