
* భారీగా చేరుకున్న పోలీసులు
* కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి (Revanthreddy) స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవా రం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్‌రెడ్డి ‘మై హోం భుజా’కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని ఆరోపణలు చేశారు. ఈక్రమంలో కాంగ్రెస్, ఎన్ ఎస్‌యూఐ నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
…………………………………………………………