* మాజీ మంత్రి రాజయ్య హౌస్ అరెస్ట్
* భారీగా చేరుకుంటున్న బీఆర్ ఎస్ శ్రేణులు
ఆకేరు న్యూస్, వరంగల్ : పాదయాత్రకు బయలుదేరిన మాజీ మంత్రి రాజయ్య(Ex Minister Rajayya)ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. స్టేషన్ ఘన్పూర్లోని నివాసం వద్ద ఆయనను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో భారీ సంఖ్యలో రాజయ్య అనుచరులు, బీఆర్ ఎస్ శ్రేణులు రాజయ్య ఇంటికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్యను అడ్డుకోవడంతో ఆయన సతీమణి పాదయాత్రకు బయలుదేరారు. పాదయాత్రను చూసి ఓర్వలేకే అడ్డుకుంటున్నారని రాజయ్య ఆరోపించారు. తనను అడ్డుకుంటోంది కడియం కాంగ్రెస్ అని, అసలు సిసలైన ఇందిర కాంగ్రెస్ వాళ్లు ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నారని తెలిపారు. కడియం బీఆర్ ఎస్సా, కాంగ్రెస్సా తెలిపేవరకూ నిలదీస్తూనే ఉంటామని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్(station ghanpur)లో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ కు ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకూ ఆందోళనలు చేపడతామన్నారు. ఆయనను తిట్టే హక్కు, అడిగే హక్కు బీఆర్ ఎస్ (Brs) శ్రేణులకు ఉందని, వారి నాయకుడిగా తనకు ఉందని తెలిపారు. తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు సాగునీరు వద్దా అన్నారు. రైతులకు నీళ్లు, యూరియా ఇచ్చేంత వరకూ ప్రభుత్వాన్ని వదలబోమని రాజయ్య అన్నారు. మరోవైపు రాజయ్య నిన్న చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కడియం అనుచరులు, కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. ఆందోళనలు ఉధృతం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
…………………………………………..
