* సోదరుడే నిందితుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ మహిళా కానిస్టేబుల్ ను తమ్ముడే దారుణంగా హత్య(Murder) చేశారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తుండగా.. ఆమెను కారుతో ఢీకొట్టి.. కింద పడ్డాక కత్తితో నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్ పోలీస స్టేషన్(Hayathnagar policestation) లో నాగమణి మహిళా కానిస్టేబుల్ (women conistable)గా పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. భర్త శ్రీకాంత్ తో కలిసి ఆమె హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆమె తన స్వంత గ్రామం రాయపోల్(Rayapol) కు వెళ్లారు. అక్కడి నుంచి విధులకు హాజరయ్యేందుకు సోమవారం హయత్ నగర్ కు వస్తున్న సమయంలో సోదరుడు పరమేశ్ ఆమెను హత్య చేశాడు. కారుతో ఢీకొట్టి.. అనతరం కత్తితో దాడి చేసి చంపేశాడు. నాగమణికి గతంలో వివాహమైంది. భర్తకు విడాకులు ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ 1న యాదగిరిగుట్ట(Yadagirigutta)లో శ్రీకాంత్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
………………………………………………….