
ఆకేరున్యూస్, విజయనగరం: ‘మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమి చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు’ అంటూ బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. తల్లిదండ్రులకు మీ పిల్లల్నీ మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృథా అవుతుందని వాపోయారు.
…………………………..