
* అధికమొత్తం వసూలు చేస్తున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్ డెస్క్ : తమిళనాడులో స్విగ్గీ జొమాటో ల వల్ల తాము నష్టపోతున్నామని హోటల్ యజమానులు ఉద్యమబాట పట్టారు.నామక్కల్ జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం కడలూరు జిల్లా వరకూ వ్యాపించింది.స్విగ్గీ, జోమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు 30–35% కమిషన్లు తీసుకుంటున్నాయని, తమకు తెలియకుండా డిస్కౌంట్లు ఇస్తున్నాయని, GST కూడా తమ దగ్గరే వసూలు చేస్తున్నారని హోటల్ యజమానులు ఆరోపిస్తున్నారు.చిన్న చిన్న పట్టణాల్లో ఉండే యజమానులకు చదువు రాక అగ్రిమెంట్ పత్రాలు చదవకుండానే సంతకాలు చేశారని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల హోటళ్లు నష్టాలతో నడుస్తే తప్పనిసరి పరరిస్థితుల్లో ఆ డెలివరీ యాప్ లను బహిష్కరిస్తున్నట్లు హోటల్ యజమానులు అంటున్నారు.పెద్ద యాప్‌లకు పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లించకుండా, స్థానిక వ్యక్తి కడలూరు జిల్లా చిదంబరం వాసి రామ్ ప్రసాద్ రూపొందించిన జారోజ్ అనే డెలివరీ యాప్‌తో హోటల్ యజమానులు భాగస్వాములు అవుతున్నారు.
……………………………………………….