ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్:
ఇందిరమ్మ ఇళ్ల తో సొంతింటి కలను సహకారం చేసుకోవాలని హౌసింగ్ పీడీ మాతృ నాయక్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో బుధవారం గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ జిల్లా అధికారి మాతృ నాయక్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లు నిర్మాణం ప్రారంభించని లేదా మధ్యలోనే ఆలస్యం చేస్తున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లుల విడుదలలో ఏమైనా జాప్యం ఉందా ? ఇసుక కొరత లేదా ఇతర నిర్మాణ సామగ్రి సమస్యలు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని పీడీ
మాతృనాయక్ సూచించారు.
అనంతరం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారు. మిగితా పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, లబ్ధిదారులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ చంద్రశేఖర్, ఎఈ అఖిల, ఉప సర్పం చ్ లింగనబోయిన రాజు, వార్డ్ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
