* భూకంప తీవ్రతతో 36 మంది మృత్యువాత
ఆకేరున్యూస్ డెస్క్: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతతో 36మంది మరణించినట్లు సమాచారం. నేడు భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా రికార్డు అయింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరో 38 మంది త్రీవంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిసింది.
…………………………………