
* పోలీసుల దర్యాప్తు
ఆకేరు న్యూస్, నల్గొండ : ఓ బిర్యానీ సెంటర్లో తెల్లవారుజామున జరిగిన భారీ పేలుడు కలకలం సృష్టించింది. తొలుత గ్యాస్ సిలిండర్ వల్ల పేలుడు సంభవించినా, అలాంటిది ఏమీ లేదని తేలడంతో పేలుడిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నల్గొండ – హైదరాబాద్ రోడ్డులోని పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్(Hall Bucket Biryani Center)లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి షెటర్ గేటుతోసహా లోపల ఉన్న సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా అర్ధరాత్రి వరకు షాప్ తెరిచే ఉన్నదని, షాప్ బంద్చేసిన 15 నిమిషాలకు ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ అయితే ఏమీ పేలలేదని, మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
…………………………………