
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. బంగాల్ రాష్ట్రం మాల్డా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల ఎమ్డీ.నూర్ అఖ్తర్, 22 ఏళ్ల అజాత్ మెమిన్ బంగాల్ నుంచి మాదకద్రవ్యాలను హైదరాబాద్ నగరానికి తెచ్చి వక్రయిస్తున్నారు. నగరంలోని గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలో వీరి నుంచి 66 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
………………………………