
* కిక్కిరిసిన ఈద్గాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు (Ramzan celebrations) నిర్వహించారు. ఈద్గాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ ( Eid Mubarak) తెలుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మక్కామసీదు, మీరాలం ఈద్గా, బడీ మసీదు తదితర చోట్ల ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
……………………………………..