* 27 మున్సిపల్, కార్పొరేషన్ల విలీనంతో ఘనత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఇకనుంచి దేశంలోనే మహానగరంగా మారనుంది. సుమారు 2,735 చ.కి.మీ. పరిధి వరకు పెరిగి అతిపెద్ద నగరంగా అవతరించనుంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఈ ఘతన దక్కింది. ఔటర్ పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనానికి నిర్ణయించారు. దీంతో జీహెచ్ఎంసీ సేవలు మున్ముందు ఔటర్ అవతలి వరకు గల ప్రాంతాల వరకు అందనున్నాయి. మున్ముందు జీహెచ్ఎంసీ ఒకే పాలకమండలిగా ఉంటుందా.? లేక పాలనా సౌలభ్యం కోసమంటూ వికేంద్రీకరణ చేస్తారా? అనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. మూడు పోలీసు కమిషనరేట్ల మాదిరిగా.. జీహెచ్ఎంసీని కూడా మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్పు చేస్తారని ప్రచారం వినిపిస్తోంది. ఏదేమైనా ప్రజలు మాత్రం మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలపడం వల్ల వేగంగా అభివృద్ధి సాధించేందుకు మరింత అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………..
