* మేడ పై నుంచి కుమార్తెను పడేసిన తల్లి
* తీవ్రగాయాలతో మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధి మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. వసంతపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారిని తల్లి మోనాలిసా మేడ పై నుంచి కిందకు పడేసింది. మూడో అంతస్తు నుంచి పడడంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లికి మతిస్థితిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. మొన్న రాత్రి కుటుంబంలో ఏదో గొడవ జరిగిందని పేర్కొంటున్నారు. అయితే.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………………….

