కూలిన ఎండిపోయిన చెట్టు
* మరో నెలలో జర్మనీ వెళ్లాల్సిన యువకుడు..
* బైక్‌పై వెళ్తుండగా చెట్టు కూలి టెక్కీ మృతి
* గ్యాస్ గోదాంకు వెళ్తుండగా ప్రమాదం..
నాగోలు పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన వి. సాయికుమార్ (29) హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
బుధవారం గ్యాస్ బుక్ చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR) సమీపంలోని గ్యాస్ గోదాంకు తన బంధువుల అబ్బాయి సత్య ఫణీంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్టు (Tree Fall Accident) ఒక్కసారిగా కూలిపోయింది. నేరుగా సాయికుమార్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
* నెల క్రితమే వివాహం.. జర్మనీ వెళ్లేందుకు సిద్ధం
ఈ ప్రమాదంలో సత్య ఫణీంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చెట్టు కూలిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సాయికుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, సాయికుమార్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. మరోవైపు జర్మనీలో ఉద్యోగ అవకాశం రావడంతో నెల రోజుల్లో అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
* అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
ప్రమాదానికి కారణమైన చెట్టు ఎండిపోయి, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకర చెట్లను తొలగించాలని గతంలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు ముందుగానే స్పందించి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో ఎండిపోయిన చెట్లు వాహనదారులకు ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో బలహీనంగా ఉన్న చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదకర చెట్లను ముందుగానే గుర్తించి తొలగించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. మరో ప్రాణం బలికాకముందే అధికారులు స్పందించి ఎండిపోయిన చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read : హైదరాబాద్‌లో టీజీ సేఫ్ తనిఖీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

