* అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్‌లో రాస్తున్నాం
* మాకు త్యాగాల చరిత్ర ఉంది
* అరెస్టులకు భయపడేది లేదు
* రాష్ట్రంలో సిట్లు ఒక ప్రహసనంగా మారాయి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో సిట్లు ఒక ప్రహసమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. డిఫెన్స్ లో పడింది కాబట్టే తనకు నోటీసు ఇస్తారట అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌కు నోటీసులపై ఆయన స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అని తెలిపారు. పోస్టుల కోసం కొందరు అధికారులు అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఏపీలో ఏం జరిగిందో చూశారు కదా అన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బంది మీకూ అదే గతి పడుతుందని పేర్కొన్నారు. తమకు త్యాగాల చరిత్ర ఉందని, అరెస్టులకు భయపడేది లేదని తెలిపారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని చెప్పారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్ లో రాస్తున్నామని వెల్లడించారు. అక్రమాలు, అరాచకాలు, సెటిల్మెంట్లు అన్నీ నమోదు చేస్తున్నామన్నారు. బీఆర్ ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రిటైరైనా, విదేశాలకు వెళ్లినా, కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామన్నారు.
………………………………………………………..

