* తప్పిన పెను ప్రమాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనమ్లోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అక్కడకు చేరుకొని విద్యార్థులను బయటకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కోచింగ్ సెంటర్లో ఉన్న బా్యటరీలు పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. విద్యార్థులు క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చున్నారు.
……………………………………….
