
* నగరవాసులకు షాకింగ్ న్యూస్..
ఆకేరున్యూస్, హైదరాబాద్: నగరవాసులకు మెట్రో రైల్ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. మెట్రో చార్జీలు పెంచుతున్నట్లు ప్రచారం ఆగుతుంది. జంట నగరాల పరిధిలో నిత్యం లక్షల్లో జనం మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. హెవీ ట్రాఫిక్, వాయు కాలుష్యం బారీ నుంచి తప్పించుకునేందుకు మెజారిటీ నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ పిడుగులాంటి వార్త చెప్పబోతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. గత ఫెనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉన్నట్లుగా ఇటీవలే ప్రకటించింది. అయితే, కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో చార్జీలు వెంటనే పెంచాలంటూ 2022లో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ను కోరింది. దీంతో, అప్పటి ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా.. వారు మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ యాక్ట్-2002 కింద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతిపాదనలు, ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చార్జీల పెంపునకు ఓకే చెప్పింది. కానీ, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు నో చెప్పింది. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో ఎల్ అండ్ టీ భారీ నష్టాలు చవిచూస్తున్న వేళ చార్జీల పెంపు తప్పేలా కనిపించడం లేదు. అయితే, ఇటీవలే బెంగళూరు మెట్రో చార్జీలు 44 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కనిష్ట ఫేర్ రూ.10, గరిష్టంగా రూ.60 ఫేర్ ఉండగా.. ఆ చార్జీలపై ఎంత మేర చార్జీలు పెంచుతారనేది క్లారిటీ రావాల్సి ఉంది.
……………………………………..