ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వక్రబుద్ధితో ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని చితక్కొట్టారు. ఆ పాప తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలోనే ఉరికించి ఉరికించి దేహశుద్ధి చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిస్సీ స్వాతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నాడు. తరగతి గదుల్లో కాకుండా పాఠశాల భవనంపై ఉంటున్న ప్రధానోయుడు గదికి పిలిపించుకొని ఓ బాలిక(15)తో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంటి పనులు చేయిస్తున్నాడు. కొన్నిరోజులుగా ముభావంగా ఉంటున్న బాలికను తల్లి దండ్రులు ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బందువులు, విద్యార్ధి సంఘం నాయకులు మంగళవారం స్కూల్ వద్దకు చేరుకొని, ప్రధానోపాధ్యాయుడు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పక పోవడంతో అతడికి దేహశుద్ధి చేశారు. స్కూల్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం సిబ్బంతో కలిసి సంఘటనా స్ధలానికి చేరుకొని, తల్లి దండ్రులు, బందువులు, విద్యార్ధి సంఘం నాయకులు సర్ది చెప్పి ప్రధానోపాధ్యాయుడుని అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………..

