* సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
* టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారంపై ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం లంచ్ అవర్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు, సీనియారిటీ అంశాలపై కోర్టు కేసుల్లో కావాలనే జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆరోపించారు. అర్హులైన ఎస్టీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయమైన పదోన్నతులు కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఆర్టిజన్లపై వివక్షపూరిత చర్యలు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆరోపించారు. 2024కు ముందు నియామకులైన ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింపచేయాలని, పెండింగ్‌లో ఉన్న మెడికల్, అత్యవసర బదిలీలను వెంటనే పరిష్కరించాలన్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఈమేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందచేశామని టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఆనంద్‌బాబు వెల్లడించారు.
……………………………………………
