Village Panchayat Building Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రెండేళ్ల క్రిందట శంకుస్థాపన చేసిన లింగంపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం మండల శాఖ డిమాండ్ చేసింది. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని లింగంపల్లి గ్రామ కమీటి ఆధ్వర్యంలో గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఎం గ్రామ కార్యదర్శి ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ గత 20 సవంత్సరాల క్రితం గ్రామ పంచాయతీ సంబందించిన భూమిలో 6 రూములు అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కిరాయికి నడిపించేవారు. ఒక్కో షాప్ కి 3 వేల నుండి 5 వేల వరకు కిరాయి వసూలు చేసిన ఏడాదికి దాదాపుగా 30 వేలు వచ్చేది. అట్టి గదులను తొలగించి నూతన గ్రామపంచాయతి నిర్మాణం కోసం డిసెంబర్ 7, 2024లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. రెండేళ్లు గడుస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేపట్టకపోవడం విడ్డూరం అన్నారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి వెంటనే నూతన గ్రామపంచాయతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమీటి సభ్యులు అపారదాపు రాజు, పురామని శ్రవణ్, కర్రె నాగరాజు, సారయ్య, రాజయ్య, మల్లేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
